Telugu News » Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..!

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..!

నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.

by Mano
Tirumala: In Tirumala, once again the leopard is in trouble.. Devotees in panic..!

తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.

Tirumala: In Tirumala, once again the leopard is in trouble.. Devotees in panic..!

గతంలో అలిపిరి నడక మార్గంలో చిరుతలు సంచరించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు కొవ్వూరుకు చెందిన బాలిక లక్షితపై దాడిచేసి చంపేసింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీశాఖ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటు చేసింది.

తాజాగా, డిసెంబర్‌ 13, 26 తేదీల్లో ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగు కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో టీటీడీ అప్రమత్తమయింది. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు పలు సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

ఇప్పటి వరకు టీటీడీ ఐదు చిరుత పులులను బంధించింది. దీంతో మెట్ల మార్గంలో అడవి జంతువుల బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి చిరుత, ఎలుగును గుర్తించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

You may also like

Leave a Comment