Telugu News » Hero Suman: సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి… హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు…!

Hero Suman: సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి… హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు…!

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీవిస్తోన్న గౌడ జాతికి ఎస్సీ స్టేటస్ కల్పించి వారిని ఆదుకోవాలని సినీ హీరో సుమన్(Hero Suman) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి విజ్ఞప్తి చేశారు.

by Mano
Hero Suman: CM Revanth Reddy should be committed... Key comments of Hero Suman...!

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీవిస్తోన్న గౌడ జాతికి ఎస్సీ స్టేటస్ కల్పించి వారిని ఆదుకోవాలని సినీ హీరో సుమన్(Hero Suman) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమన్ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో మార్పులు వస్తున్నాయని అన్నారు.

Hero Suman: CM Revanth Reddy should be committed... Key comments of Hero Suman...!

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ఉండాలనీ.. తెలంగాణ భవిష్యత్తుకు మరింత మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సుమన్ ఆకాంక్షించారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో గౌడ జాతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న వారికి ఎస్సీ స్టేటస్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్సీ స్టేటస్ అమలు చేయాలన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా గౌడ జాతి తరఫున విన్నపం అని పేర్కొన్నారు.

తాను ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయిందన్నారు. భగవంతుని దయతో ఇప్పటివరకు పది భాషల సినిమాలలో నటించగలిగానని సుమన్ తెలిపారు. తెలుగు సినిమాలో హీరోగా 100 సినిమాలు, తమిళంలో 50, కన్నడలో 50 సినిమాలలో నటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నన్ను ఆదరించిన అభిమానులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నట్లు హీరో సుమన్ తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, పేద ప్రజలందరికీ మరింత సేవ చేయాలన్నారు సుమన్. ఏదైనా తప్పులు జరిగి ఉంటే అన్ని క్లియర్ అయిపోయి, అందరూ సంతోషంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శకులు, నిర్మాతలందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

You may also like

Leave a Comment