Telugu News » Hyderabad : తగ్గేదే లే.. నగరంలో భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు..!!

Hyderabad : తగ్గేదే లే.. నగరంలో భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు..!!

సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. PV ఎక్స్‌ప్రెస్‌వేలో ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు.. ఆదివారం రాత్రి 8 గంటలకు వరకు నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను మూసివేశారు.

by Venu

నగరంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌ ల్లో యువత ఆనందం రెట్టింపు అయ్యేలా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. మరోవైపు నగర ప్రజలు అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపై తిరుగుతూ, బాణాసంచా కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కానీ చట్టం మాత్రం తనపని తాను చేసుకొంది.

ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk And Drive) తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాలు సేవించిన వారిని పట్టుకొన్నారు. హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ల పరిధిలో 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అందులో హైదరాబాద్‌లో 1500 కేసులు, సైబరాబాద్‌ (Cyberabad)లో 1241 కేసులు, రాచకొండ (Rachakonda)లో 517 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 3500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు..

కాగా సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. PV ఎక్స్‌ప్రెస్‌వేలో ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు.. ఆదివారం రాత్రి 8 గంటలకు వరకు నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను మూసివేశారు.

You may also like

Leave a Comment