ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ స్థాపన గురించి ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన పంచుకున్నారు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ గురించి ఆయన పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో తన అప్లికేషన్ ను విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ రిజెక్ట్ చేసారని.. ఒకవేళ రిజెక్ట్ చేయకుంటే నేను ఇన్ఫోసిస్ ను పెట్టేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఇన్ఫోసిస్ విప్రో సంస్థకి పోటీగా నిలిచింది. ఆ తరువాత అజీమ్ ప్రేమ్‌జీ మూర్తిని నియమించడంలో నిర్లక్ష్యం చేయడం ఓ తప్పిదం అని ఒప్పుకున్నారు కూడా. నారాయణ మూర్తి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు “నన్ను ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే అతను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ఒకసారి నాతో చెప్పాడు” అని చెప్పుకొచ్చారు. జనవరి 12 నాటికి, ఇన్ఫోసిస్ విలువ ₹6.65 లక్షల కోట్లు, విప్రో ₹2.43 లక్షల కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్‌ని ప్రారంభించే ముందు, మూర్తి కెరీర్‌లో IIM అహ్మదాబాద్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేశారు, అక్కడ అతను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం బేసిక్ ఇంటర్‌ప్రెటర్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఇన్ఫోసిస్‌కు ముందు, సాఫ్ట్‌ట్రానిక్స్‌ని స్థాపించడంలో ఆయన ప్రయత్నం విఫలం అయ్యింది. దీనితో ఆయన పూణేలోని పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో చేరారు. నారాయణ మూర్తి మరియు భార్య సుధా మూర్తి ప్రచురించిన జీవిత చరిత్ర ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ గురించి అనేక కథలు స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ పుస్తకంలో నారాయణ మూర్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి.