Telugu News » అప్పట్లో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించి.. ఇప్పుడు తల్లిగా కనిపించిన హీరోయిన్.. ఎవరంటే?

అప్పట్లో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించి.. ఇప్పుడు తల్లిగా కనిపించిన హీరోయిన్.. ఎవరంటే?

మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా, తల్లిగా నటించిన యాక్ట్రెస్ ఎవరో తెలుసా?

by Sri Lakshmi

సినిమా ఇండస్ట్రీలో నిజంగానే వయసుతో పని లేదు. మేకప్ మేజిక్ తో ఎంత వయసు వచ్చినా కుర్ర హీరోగానే లేదా కుర్ర హీరోయిన్ గానే చూపించేస్తుంటారు. అయితే.. అమ్మాయిల విషయంలో మాత్రం ఈ లెక్క కొంచం తక్కువే. ఎందుకంటే.. కొంచం వయసు వచ్చినట్లు కనిపించినా.. వారిని తల్లి పాత్రలకు, అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తూ ఉంటారు. అయితే.. మహేష్ బాబు రీసెంట్ సినిమా గుంటూరు కారంలో రమ్యకృష్ణ మహేష్ బాబుకు తల్లిగా నటించారన్న సంగతి తెలిసిందే. అయితే.. రమ్య కృష్ణ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మహేష్ బాబు పక్కన స్టెప్పులేశారని తెలుసా?

మహేష్ బాబు వయసు కూడా నలభైకి చేరుకుంది. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తారు. ఆయన వయసు కప్పిపుచ్చడానికి మేకప్ ఏమీ అవసరం లేదు. సహజంగానే ఆయనకు ఉండే అందం అలాంటిది. అయితే.. ఇలా వయసు ఎక్కువ ఉన్న హీరోలు తమకంటే వయసు తక్కువ ఉన్న హీరోయిన్స్ తో నటించడం కొత్తేమీ కాదు. ఎంత వయసు వస్తున్నా వీరు హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు. అప్పట్లో మనవరాలిగా నటించిన శ్రీదేవితో కూడా.. కొన్నేళ్ల తరువాత హీరోయిన్ గా నటిస్తే సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులేశారు కూడా.

అయితే.. ఇప్పుడు రమ్యకృష్ణ, మహేష్ బాబుల వీడియో వైరల్ అవుతోంది. సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో రమ్యకృష్ణ మహేష్ బాబు పక్కన స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ సాంగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా “మార్కండేయా..” అంటూ అదోలా ఉండే ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ ని తరువాత సినిమా నుంచి తీసేశారట. కానీ, ఈ వీడియో మాత్రం యు ట్యూబ్ లో ఓ చిన్న ఛానెల్ లో ఉంది.

You may also like

Leave a Comment