భారత్(Bharath) లో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. మనం పీల్చే గాలిలో ఎన్నో విషపూరిత వాయువులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా(Most Polluted Cities)ను కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(CPCB) తాజాగా విడుదల చేసింది.
వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు పంట పొలాల్లోని వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందని తెలిపింది. ఈ ఏడాది అత్యంత కాలుష్యం నగరాల లిస్ట్‌లోకి బాలాసోర్ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ఈ మధ్య పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు మొత్తం 3,634 గుర్తించినట్లు తెలిపింది.
పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది. బెగుసరాయ్, బల్లాబ్ గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గ్వాలియర్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాలని ఈ నివేదిక తేల్చింది. బాలాసోర్ గాలి నాణ్యత (ఏక్యూఐ) 406 పాయింట్లకు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో పేర్కొంది.
బాలాసోర్ తర్వాతి స్థానంలో ఢిల్లీ 371, బాలాపూర్ 359, బరిపద 355, భీవాడి 349, ఛండీఘర్ 348, శ్రీ గంగానగర్ 346, రాజ్ఝర్ 339 ఉన్నాయి. అదేవిధంగా హనుమాన్ ఘర్ 328, చప్రా323, నోయిడా (318), గురుగ్రామ్ (317), ఘజియాబాద్ 304 స్థానాల్లో ఉన్నాయని ప్రకటించింది.
మరోవైపు, నార్త్ రాష్ట్రాల్లోని పంట పొలాల వ్యర్థాల కాల్చివేతలు పెరుగుతున్నాయని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఎస్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. గాలి కాలుష్యం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులు చూచిస్తున్నారు.