Telugu News » KTR : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలి.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!!

KTR : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలి.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!!

ఇప్పటికే కేసీఆర్ (KCR) రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకొంటూ ఉంటారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుండగా.. చిన్న దొర మాత్రం త్వరలోనే పెద్ద దొర ప్రజల ముందుకు వస్తారని తెలుపుతూ.. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలో వివ‌రించారు.

by Venu

పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ (BRS)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చిన్న దొర చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షాక్ నుంచి గులాబీ నేతలు ఇంకా కొలుకోలేదనే ప్రచారం జోరుగా సాగుతోన్న నేపథ్యంలో 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు..

ఇప్పటికే కేసీఆర్ (KCR) రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకొంటూ ఉంటారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుండగా.. చిన్న దొర మాత్రం త్వరలోనే పెద్ద దొర ప్రజల ముందుకు వస్తారని తెలుపుతూ.. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలో వివ‌రించారు. తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌రాన్ని పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా, స్ప‌ష్టంగా వినిపించేది కేవ‌లం బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు 16, 17వ లోక్‌స‌భ‌లో తెలంగాణ (Telangana) హ‌క్కులు, ప్ర‌యోజనాల కోసం కేంద్రాన్ని నిల‌దీసినట్టు గుర్తు చేశారు. లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్ర‌శ్నించ‌గా, కాంగ్రెస్ 1271 సార్లు, బీజేపీ (BJP) కేవ‌లం 190 సార్లు మాత్ర‌మే ప్ర‌శ్నించిన‌ట్లు కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్ర‌మేనని పేర్కొన్నారు..

2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే.. అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ మాటలు ప్రస్తుతం ప్రజలు నమ్మే స్థితిలో లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేచిన నేతల గొంతులు పదవులు పొగానే మూగబోవడం విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్.. హరీష్ రావు తప్ప పెద్దగా బీఆర్ఎస్ నేతలు ఎవరు ప్రజల మధ్యకు వెళ్ళడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

You may also like

Leave a Comment