అయోధ్య (Ayodhya) రామ మందిర (Ram Mandhir) ప్రారంభోత్సవం రోజున బెంగాల్లో సర్వమత ర్యాలీకి టీఎంసీ (TMC) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee) పిలుపు నివ్వడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమతా బెనర్జీ వెళ్లడం లేదని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ అన్నారు.
కానీ బెంగాల్లో ఆమె ఊరెగింపు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఎవరిని కలుపుతోందని ప్రశ్నించారు. బెంగాల్లో రక్తపాతం జరుగుతోందన్నారు. ఆమెను ఆ రాముడు కూడా క్షమించబోడని ఫైర్ అయ్యారు. మరోనేత సుకాంత్ మజుందార్ మాట్లాడుతూ…. బెంగాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లొ బాబర్ మద్దతుదారులు రామ మందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఉత్సవాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు.
బెంగాల్ ను ఉగ్రవాదుల కేంద్రంగా సీఎం మమతా బెనర్జీ మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతకు ముందు సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ…. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగే రోజు బెంగాల్లో ‘సర్వ ధర్మ’ర్యాలీని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాళీ ఘాట్ ఆలయం వద్ద తాను ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తానని తెలిపారు.
అన్ని మతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మమతా బెనర్జీ కోరారు. రామ మందిరి ప్రాణ ప్రతిష్టకు కౌంటర్ గా ఈ ర్యాలీని చేపడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ….. తాను రామ మందిరానికి కౌంటర్‌గా ఇ ఈవెంట్ చేయడం లేదన్నారు. మతం వేరు, కానీ పండుగలు అందరికీ ఉంటాయని చెప్పారు. తాను అంతకు మించి చెప్పలేనన్నారు.