Telugu News » Chiranjeevi: మెగాస్టార్‌కు అరుదైన గౌరవం.. త్వరలో కేంద్రం ప్రకటన..?

Chiranjeevi: మెగాస్టార్‌కు అరుదైన గౌరవం.. త్వరలో కేంద్రం ప్రకటన..?

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి మరో అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్’(Padma Vibhushan) వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రిపబ్లిక్ డే రోజు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

by Mano
Chiranjeevi: A rare honor for Megastar.. Center announcement soon..?

తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి మరో అత్యున్నత పురస్కారం వరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పద్మభూషణ్‌ అవార్డును అందుకున్న మెగాస్టార్‌కు ఇప్పుడు ‘పద్మవిభూషణ్’(Padma Vibhushan) వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Chiranjeevi: A rare honor for Megastar.. Center announcement soon..?

అయితే, ఈ విషయమై రిపబ్లిక్ డే రోజు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. చిరంజీవి లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన ఎంతో మంది సినీ కార్మికులకు అండగా నిలిచారు. వారికి అవసరమైన నిత్యావసరాలను అందజేశారు. సినీ కార్మికులతో పాటు కొవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు.

సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 2006లో పద్మభూషణ్‌ అవార్డును స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఈ అవార్డు వరించింది. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది. ఈ వార్త తెలిసి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఫాంటసీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

You may also like

Leave a Comment