సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై, బీఆర్ఎస్ (BRS) నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని 100 మీటర్ల లోతు గోతిలో పాతిపెడతామని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ సన్నాసి.. అబద్దాల పునాదుల మీద పని చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ను పట్టుకుని డూప్లికేట్ అనడం తగదని సూచించారు.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడిన ఆయన దూకుడుగా వ్యవహరించారు..
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎద్దేవా చేశారు. కనీసం దావోస్లోనైనా చిల్లరగా వ్యవహరించడం మానలేదని విమర్శించారు.. రేవంత్ దావోస్ పర్యటన ప్రచార ఆర్భటానికేనని సెటైర్ వేశారు. ఢిల్లీలో అదానీతో కుస్తీ దావోస్లో దోస్తీ యా అని నిలదీశారు. మోడీని, రేవంత్ కలిసిన తర్వాత ఆదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? అని దాసోజు శ్రవణ్ షాకింగ్ (Dasoju Shravan) కామెంట్స్ చేయడం చర్చాంశనీయంగా మారింది.
దావోస్ లో మంత్రి శ్రీధర్ బాబును తక్కువ చేసి చూపడం దారుణమని పేర్కొన్నారు. పదవుల కోసం రాజకీయాల్లో అబద్దాలు ఆడారు.. ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కూడా రేవంత్ అబద్దాలు ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదానీని తిడుతుంటే.. రేవంత్ వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. పాలనపై అవగాహన లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు..