Telugu News » Earthquake: చైనాను కుదిపేసిన భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు..!!

Earthquake: చైనాను కుదిపేసిన భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు..!!

చైనా(China)లో భారీ భూకంపం(Earth Quake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదైంది. ఈ ప్రభావంతో ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి.

by Mano
Earthquake: Earthquake in Jammu and Kashmir registered as 5.5 on the Richter scale..!

చైనా(China)లో భారీ భూకంపం(Earth Quake) సంభవించింది. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్(Jinjiyang) ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి పలు భవనాలు కంపించాయి. కొన్నిచోట్ల భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు సమాచారం.

Earthquake: Huge earthquake shook China.. Tremors in Delhi too..!!

ఈ ప్రకృతి విపత్తులో మృతులు, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. భూకంప కేంద్రం వుషీ కౌంటీలోని ఓ టౌన్‌షిప్ పరిధిలో భూమికి 22కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. తర్వాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించినట్లు వివరించింది.

భూకంప కేంద్రం చైనా, కిర్గిజిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే దాదాపు నెల రోజుల కిందట ఇదే వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. గ్యాన్సూ, చింగ్హాయ్ ప్రావిన్స్‌ల్లో భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. దాదాపు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 87 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 1.45 లక్షల మంది ప్రభావితులయ్యారు. 15 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 2 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

You may also like

Leave a Comment