Telugu News » Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎంకు సుప్రీం షాక్… హైకోర్టుకు వెళ్లాలని సూచన..!

Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎంకు సుప్రీం షాక్… హైకోర్టుకు వెళ్లాలని సూచన..!

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారించేందుకు భారత ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

by Mano
Hemant Soren: Supreme shock to former CM of Jharkhand... suggestion to go to High Court..!

ఝార్ఖండ్ మాజీ సీఎం, ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్‌(Hemant Soren)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Hemant Soren: Supreme shock to former CM of Jharkhand... suggestion to go to High Court..!

ఆ పిటిషన్‌ను విచారించేందుకు భారత ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. హేమంత్ సొరేన్ తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు.

సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని సుప్రీం తెలిపినట్లు చెప్పారు. తొలుత హేమంత్ సొరెన్ ఝార్ఖండ్ హైకోర్టులో మాజీ సీఎం పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని ఆరోపించారు. అయితే తాజాగా, సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు సిఫారసు చేసింది. సీఎంగా హేమంత్ సొరెన్ రాజీనామా నేపథ్యంలో ఝార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపాయి సొరెన్ సారథ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

You may also like

Leave a Comment