Telugu News » Bachupally : మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీసులు.. విచారణలో షాకింగ్ విషయాలు..!!

Bachupally : మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీసులు.. విచారణలో షాకింగ్ విషయాలు..!!

పట్టుకొన్న గంజాయి పాకెట్స్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను ఎస్‌ఓ‌టీ పోలీసులు బాచుపల్లి పోలీస్‌లకు అప్పగించారు. మరోవైపు మత్తు పదార్థాలపై తెలంగాణలో కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, తమ అక్రమ దందాకు పోలీస్‌లనే స్మగ్లర్స్‌గా వాడుకోవడం చర్చాంశనీయంగా మారింది..

by Venu

బాచుపల్లి (Bachupally) ఠానా పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు (Andhra Police) పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా.. బాలానగర్ (Balanagar) ఎస్ఓటీ (SOT) పోలీసుల కంటికి ఓ వాహనంలో తరలిస్తున్న గంజాయి చిక్కింది. ఆ వాహనంలో ఉన్న వారిని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

గంజాయితో పట్టుబడ్డ AP39 QH 1763 వాహనంలో కాకినాడ మూడవ బెటాలియన్ ఏపీ ఎస్‌పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు వారు అధిక డబ్బుకు ఆశ పడి 22 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు బాచుపల్లి ఇన్స్‌పెక్టర్ వెల్లడించారు. అయితే ఆరోగ్యం బాగాలేదు అనే సాకుతో సెలవు పెట్టి మరీ ఇద్దరు కానిస్టేబుల్‌లు గంజాయి స్మగ్లింగ్‌లో పాల్గొనడం విశేషం.

కాగా పట్టుకొన్న గంజాయి పాకెట్స్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను ఎస్‌ఓ‌టీ పోలీసులు బాచుపల్లి పోలీస్‌లకు అప్పగించారు. మరోవైపు మత్తు పదార్థాలపై తెలంగాణలో కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, తమ అక్రమ దందాకు పోలీస్‌లనే స్మగ్లర్స్‌గా వాడుకోవడం చర్చాంశనీయంగా మారింది..

You may also like

Leave a Comment