తెలంగాణ (Telanagana) కేడర్ అధికారిణి.. తెలుగింటి ఆడపడుచు అమ్రపాలి (Amrapali)కి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. ప్రస్తుతం HMDA- IT ఎస్టేట్ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ MD గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad) గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, సిటీ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత డిప్యూటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిషోర్.. ఇప్పటికే హెచ్ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.