Telugu News » Gone Prakash Rao : చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగన్ డైపర్లు వేసుకున్నారు…..!

Gone Prakash Rao : చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగన్ డైపర్లు వేసుకున్నారు…..!

షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే చరిత్ర హీనుడిగా జగన్ మిగిలిపోతాడని హెచ్చరించారు.

by Ramu
Gone prakash Rao fire on Cm Jagan

సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ( Gone Prakash Rao) తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే చరిత్ర హీనుడిగా జగన్ మిగిలిపోతాడని హెచ్చరించారు. జగన్ ఓ పిరికిపంద అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్ఐ అర్థం ఏంటో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ….

Gone prakash Rao fire on Cm Jagan

బీజేపీతో పొత్తు వలన.. టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతోందని వెల్లడించారు. టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీలో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జగన్ ముగినిపోతున్నారని అన్నారు. సజ్జల లాంటి దరిద్రుడి సలహాలతో సీఎం జగన్‌కు తీవ్ర నష్టం జరగబోతోందని హెచ్చరించారు.

ఎన్నికల తర్వాత జగన్ శాసనసభకు కూడా రాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హత్యలు కాదు.. ఆత్యహత్యలే ఉంటాయనటానికి జగనే ఉదాహరణ సీరియస్ కామెంట్స్ చేశారు. కొత్త ఇంచార్జ్‌ల్లో 35 మందికి జగన్ బీఫాం ఇవ్వరని…. మంత్రులు రోజా, విడదల రజనీకి కూడా జగన్ టికెట్ ఇవ్వరని చెప్పారు. తల్లి… చెల్లి పట్ల జగన్ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మట్లాడటం సరైంది కాదని సూచించారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయిన సమయంలో జగన్ డైపర్లు వేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని జైలు నుంచి జగన్ బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు.

జగన్‌ను నమ్ముకున్న తెలంగాణ నేతలంతా రోడ్డున పడ్డారని ఫైర్ అయ్యారు. జగన్‌ను నమ్ముకున్న కొండా సురేఖ రాజకీయంగా నష్టపోయిందని…. జగన్‌ను వదిలేయటం వలనే ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్, పుట్ట మధు, బాజిరెడ్డి, సంజీవరావులు రాజకీయంగా కుదురుకున్నారని వివరించారు. రిలయన్స్‌పై దాడులు చేసి అదే రిలయన్స్ వ్యక్తి పరిమళ్‌కు రాజ్యసభ ఇచ్చారని మండిపడ్డారు.

You may also like

Leave a Comment