Telugu News » Balakrishna : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కళ్ళు బైర్లు కమ్మేలా ఆస్తులు..!

Balakrishna : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కళ్ళు బైర్లు కమ్మేలా ఆస్తులు..!

ఇప్పటికే తెలంగాణ (Telangana) అవినీతి నిరోధక బ్యూరో (ACB)కి ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌తోపాటు ఇతర పత్రాల కాపీలన్నీ ఇవ్వాలని కోరుతూ లేఖ పంపింది. ఈ రిపోర్టు కాపీలు అందిన వెంటనే.. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుందని తెలుస్తోంది.

by Venu
ACB raids: Whale of corruption.. Former director of HMDA Balakrishna arrested..!

*శివ బాలకృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

*రంగంలోకి ఈడీ-ఐటీ ఎంట్రీ..

*ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై దర్యాప్తు..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హెచ్‌ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ (SivaBalakrishna) అక్రమాస్తుల కేసు ఎన్నో మలుపులు తీసుకొంటుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకొన్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్‌ పెట్టాయి. ఈడీ (ED), ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నాయని తెలుస్తోంది.

telangana acb finds 214 acres land of hmda former director shiva balakrishna

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారణ చేపట్టనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ (Telangana) అవినీతి నిరోధక బ్యూరో (ACB)కి ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌తోపాటు ఇతర పత్రాల కాపీలన్నీ ఇవ్వాలని కోరుతూ లేఖ పంపింది. ఈ రిపోర్టు కాపీలు అందిన వెంటనే.. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుందని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ (IT) సైతం ఇన్వాల్వ్‌ అవుతోంది.

బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద శివబాలకృష్ణ బినామీలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ జరపడానికి సిద్దం అవుతుందని సమాచారం.. ఇదిలా ఉండగా.. శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1000 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ.250 కోట్ల ఆస్తులను బాలకృష్ణ అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో శివబాలకృష్ణతోపాటు ఆయన సోదరుడు నవీన్‌ను కూడా అధికారులు అరెస్ట్‌ చేశారు.

ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు, బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో… ఇప్పటివరకు 214 ఎకరాల పొలం, 29 ఓపెన్ ప్లాట్లు, ఏడు కమర్షియల్ ఫ్లాట్లు, ఒక విల్లా, 5.5 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. బ్యాంకు లాకర్లలో 18 తులాల బంగారం, పాస్ బుక్‌లను కూడా గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడులపై పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.. ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామన్నారు.

మరోవైపు ఎనిమిది రోజులపాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు.. శివబాలకృష్ణ నుంచి పలు విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. సోదరుడు నవీన్‌ మాత్రమే కాకుండా.. మరో సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్‌ పేరుపై కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ఆదిత్య, ఫీనిక్స్ ప్రతినిధులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ కూడా ఈ కేసులో ఎంటర్‌ అయితే… దర్యాప్తు మరింత లోతుగా జరగుతుందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment