Telugu News » Telangana : ఫస్ట్​ లిస్ట్​లో ఛాన్స్​ దక్కించుకొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..!

Telangana : ఫస్ట్​ లిస్ట్​లో ఛాన్స్​ దక్కించుకొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..!

రెడ్డి సామాజిక వర్గంపై సైతం ఫోకస్ పెట్టిన కమలం.. వారిని దూరం చేసుకోకుండా ఉండటానికి మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ లో ఉందని అనుకొంటున్నారు.

by Venu
BJP Scores 3/3 In Heartland, Telangana Consolation For Congress

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ (BJP) దూకుడు పెంచింది.. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ ఢిల్లీ (Delhi)లో భేటీ అయ్యింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన కమలనాధులు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపైన సుదీర్ఘంగా చర్చించారు.

bjp-big-plans-for-parliament-elections

మరోవైపు తెలంగాణ (Telangana) బీజేపీ ఎంపీ (MP) అభ్యర్థుల జాబితా ఈ నెల 16 లోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ అభ్యర్థుల పేర్లు 17 స్థానాల్లో మొదటి జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం మొదలైంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్‌ సీట్లలో కనీసం పది సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Election) సన్నద్ధమవుతోంది.

ఈ నెల 28న పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్, మార్చి 5న నోటిఫికేషన్‌ రానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 16వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. అదీగాక తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన బీజేపీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీసీలకు 5 స్థానాలు తగ్గకుండా కేటాయించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఓట్లు రాబట్టాలని అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తోంది.

మరోవైపు రెడ్డి సామాజిక వర్గంపై సైతం ఫోకస్ పెట్టిన కమలం.. వారిని దూరం చేసుకోకుండా ఉండటానికి మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ లో ఉందని అనుకొంటున్నారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్.. చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, భువనగిరి.. మహబూబ్​నగర్ డీకే అరుణ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పెద్దపల్లి, మహబూబాబాద్​లో కాంగ్రెస్ నేతలను చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీలో ప్రయత్నిస్తోంది. ఇక నాగర్ కర్నూల్, జహీరాబాద్, వరంగల్, అదిలాబాద్ . బీఆర్ఎస్ నేతలపై కన్నేసిన అధిష్టానం.. ఆ దిశగా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ నుంచి కూడా బయటకి వచ్చిన వారికే అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. అయితే మల్కాజి​గిరి, మెదక్, హైదరాబాద్​లో ఎవరిని బరిలోకి దించాలనేది కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment