Telugu News » Telangana Assembly Sessions 2024 : గవర్నర్‌తో ముప్ఫై మోసాలు అరవై అబద్ధాలు చెప్పించారు.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి..!

Telangana Assembly Sessions 2024 : గవర్నర్‌తో ముప్ఫై మోసాలు అరవై అబద్ధాలు చెప్పించారు.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి..!

గవర్నర్‌తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ప్రగతి భవన్‌ గతంలో కూడా ప్రజా భవన్​ అని అన్నారు.. బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

by Venu
budget sessions in telangana assembly till february 13

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Revanth Reddy) సమాధానం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..

budget sessions in telangana assembly till february 13

గవర్నర్‌తో ముప్పై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ప్రగతి భవన్‌ గతంలో కూడా ప్రజా భవన్​ అని అన్నారు.. బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం చేయాలని అడిగారు. ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొన్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈఎంఐలు కట్టలేక చాలామంది డ్రైవర్లు రోడ్డున పడ్డారని అన్నారు. కాంగ్రెస్​ చెప్పిన 13 అంశాల గురించే తాము అడుగుతున్నామన్నారు.. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా అని పల్లా రాజేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

రెండు నెలల్లో ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. చట్టసభల్లో అబద్ధాలు చెప్పడం తీవ్ర నేరమని సూచించారు. మరోవైపు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నలకు మంత్రి శ్రీధర్​ బాబు సమాధానం ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం తమ బాధ్యత అని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు సాయం చేస్తామని.. ఈ అంశాన్ని బడ్జెట్‌లో పొందుపరుస్తామని వెల్లడించారు.

You may also like

Leave a Comment