Telugu News » Samajwadi Party : రాజ్యసభకు క్షమాపణ చెప్పిన ఎంపీ జయాబచ్చన్…!

Samajwadi Party : రాజ్యసభకు క్షమాపణ చెప్పిన ఎంపీ జయాబచ్చన్…!

ఎప్పుడూ కోపంగా ఉండే జయాబచ్చన్ శుక్రవారం భావోద్వేగానికి గురయ్యారు. తన శైలికి భిన్నంగా ఈ సారి అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెప్పారు.

by Ramu

సమాజ్ వాది (Samajwadi Party) పార్టీ ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachan) పదవీ కాలం ముగిసింది. రాజ్యసభలో శుక్రవారం ఆమె తన చివరి ప్రసంగం చేశారు. ఎప్పుడూ కోపంగా ఉండే జయాబచ్చన్ శుక్రవారం భావోద్వేగానికి గురయ్యారు. తన శైలికి భిన్నంగా ఈ సారి అందరికీ చేతులు జోడించి క్షమాపణ చెప్పారు.

Why Jaya Bachchan Apologised In Her Rajya Sabha Farewell Speech

ఇటీవల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై కూడా ఆమె ఆవేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడుతూ….. తాను షార్ట్ టెంపర్డ్ మనిషినని చెప్పారు. అంతే కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

తాను ఎప్పుడూ ఎందుకంత ఆవేశంగా ఉంటానని అంతా అడుగుతారని చెప్పారు. అది తన స్వభావమని అన్నారు. తనను తాను మార్చుకోలేనని పేర్కొన్నారు. తనకు ఏదైనా నచ్చక పోతే లేదా దేన్నైనా అంగీకరించకపోతే, తాను ప్రశాంతతను కోల్పోతానని స్పష్టం చేశారు.

సభలో తాను ఎవరితోనైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని వెల్లడించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల సహకారాన్ని చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ గుర్తు చేసుకున్నారు. సభ్యులు పంచుకున్న జ్ఞానాన్ని, వాళ్లను సభ చాలా మిస్ అవుతోందని అన్నారు.

You may also like

Leave a Comment