Telugu News » Sleep talk : నిద్రలో మాట్లాడటం…వరమా !? జ్వరమా..!?

Sleep talk : నిద్రలో మాట్లాడటం…వరమా !? జ్వరమా..!?

తిండి,గాలి,నీరు,నిద్ర ఇవి మనిషి జీవించడానికి చాలా ముఖ్యం. ప్రస్తుత జీవన శైలి కారణంగా పైవేవీ కరెక్టు టైమ్ కి శరీరానికి అందించలేక పోతున్నాం. తద్వారా అనారోగ్యానికి గురవుతున్నాం.

by sai krishna

తిండి,గాలి,నీరు,నిద్ర ఇవి మనిషి జీవించడానికి చాలా ముఖ్యం. ప్రస్తుత జీవన శైలి కారణంగా పైవేవీ కరెక్టు టైమ్ కి శరీరానికి అందించలేక పోతున్నాం. తద్వారా అనారోగ్యానికి గురవుతున్నాం.

మన జీవితంలో ముఖ్య భూమిక పోషించే నిద్ర విషయానికి వస్తే ..పరిస్థితుల కారణంగా శరీరానికి కావాల్సిన 8 గంటలు నిద్రను ఇవ్వలేకపోతున్నాం.ఈ కారణంగా ప్రపంచం మొత్తం వ్యాధుల బారిన పడుతోంది.

శరీరానికి తగిన నిద్ర ఇవ్వక పోతే వచ్చే సమస్యల్లో చెప్పుకోతగ్గది నిద్రలో మాట్లాడటం..దీన్నే కలవరించడం(disturbing) అంటారు . కొందరైతే ఉలిక్కిపడి నిద్ర మధ్యలోనే లేచేస్తుంటారు.

అది వారికి ఎలా ఉన్నా పక్కవారిని చాలా భయపెడుతుంది. ఈ సమస్య వృద్ధుల్లోనే కాదు. పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.చాలామంది నిద్రలో మాట్లాడటం సాధారణమైనదిగా భావిస్తారు. అయితే ఈ సమస్య ఓ అనారోగ్య సమస్య అని మనలో చాలా మందికి తెలియదు.

స్లీప్ టాకింగ్(Sleep talking)అనేది పారాసోమ్నియా(Parasomnia)అని పిలువబడే ఒక రకమైన కల రుగ్మత. పారాసోమ్నియాలో ప్రజలు నిద్రలో మాట్లాడటం అలవాటు చేసుకుంటారు.


ఎదుటివారికి అర్థంకాని విషయాన్ని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రజలలో సర్వసాధారణంగా మారింది. అయితే, నిద్రలో మాట్లాడే సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వెనుక కారణాలు ఏమై ఉండవచ్చో మనం ఇక్కడ తెలుసుకుందాం.

అలసట, నిద్ర మధ్య చాలా లోతైన సంబంధం ఉంది. మీరు బాగా అలసిపోయినప్పుడు గాఢ నిద్ర వస్తుంది. అలసటగా ఉన్నా నిద్ర రాకపోవడం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు తరచుగా రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుంటూ కనిపిస్తారు.డిప్రెషన్(Depression)అనేది కూడా ఓ సమస్య. ఇది బాధితుడిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు.

నిద్రపోతున్నప్పుడు కూడా.. ఒక వ్యక్తి డిప్రెషన్ కారణాల గురించి లేదా దానికి సంబంధించిన కలల గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాడు. డిప్రెషన్ కారణంగా.. చాలా సార్లు, అతను కారణం తెలియకుండా భయపడటం ప్రారంభిస్తాడు. నిద్రలో మాట్లాడుతుంటాడు.


ఎవరైనా 7-8 గంటల పాటు తగినంత నిద్రపోలేకపోతే.. వారు నిద్రలో మాట్లాడే పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.చాలా సార్లు తమ నిద్రలో మాట్లాడటం లేదా అధిక జ్వరం కారణంగా కలవరించడం మనం చూస్తుంటారు. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇలా కలవరించడం మనం చూస్తాం.

అధిక జ్వరం ఉన్నప్పుడు ఎవరైన ఇలా చేస్తారు. వీటినుంచి బయట పడ్డానికి చాలా చిన్న చిట్కాలు ఉన్నాయి. తగినంత నిద్ర పొందడానికి ప్రయత్నించడం. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండడం.

డిప్రెషన్ మిమ్మల్ని డామినేట్ చేయనివ్వకుండా చూసుకోవడం.సమస్యల్ని సానుకూలంగా ఆలోచించడం.యోగా లేదా ధ్యానం చేయడం. మీకు ఇష్టమైన కార్యకలాపాలు చేసుకుంటూ సమస్యల్ని అధిగమించడం.

గమనించ వలసిన విషయం ఏంటంటే..ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

You may also like

Leave a Comment