Telugu News » HIV Antiretroviral therapy: హెచ్ఐవీ ఎయిడ్స్‌కు పూర్తి స్థాయి చికిత్స..!

HIV Antiretroviral therapy: హెచ్ఐవీ ఎయిడ్స్‌కు పూర్తి స్థాయి చికిత్స..!

వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి క్షీణించకుండా కొన్ని మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని సాధించారనే చెప్పాలి.

by Mano
HIV Antiretroviral therapy: Complete treatment for HIV AIDS..!

ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీ(HIV)కి ఇంత వరకు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతానికి వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి క్షీణించకుండా కొన్ని మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని సాధించారనే చెప్పాలి.

HIV Antiretroviral therapy: Complete treatment for HIV AIDS..!

నివారణ లేని హైఐవీని నయం చేయడానికి కొత్త మార్గాన్ని అన్వేషించారు శాస్త్రవేత్తలు. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్సను కొనుగొన్నట్లు తెలిపారు. తాజాగా కీలక పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఆమ్‌స్టర్‌ డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల టీమ్, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ జీన్ -ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు.

డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశముంది. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగించారు. ఫస్ట్ ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పని చేసి చెడు భాగాన్ని తీసేస్తుంది.

ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుంచి విముక్తి చేయగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని నాటింగ్ హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. ఆ ప్రయత్నాలను విజయవంతం చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్ అని తెలిపారు.

ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి అని చెప్పారు. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుందన్నారు. ఈ మందులను నిలిపి వేస్తే శరీరా కణాల్లో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్‌ ఇనిస్టిట్యూట్‌లోని వైరస్ నిపుణుడు చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment