Telugu News » Infection in Kerala: మరో వైరస్ కలకలం.. ఒక్క రోజులోనే 190 కేసులు..!

Infection in Kerala: మరో వైరస్ కలకలం.. ఒక్క రోజులోనే 190 కేసులు..!

కేరళ(Kerala)లో గవదబిళ్లల వ్యాధి విస్తరిస్తోంది. దీనిని హిందీలో కంఠమాల(Kantamala)లేదా గల్సువా(Galsuva) అని పిలుస్తుంటారు. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 190 కేసులు నమోదైనట్లు సమాచారం.

by Mano
Infection in Kerala: Another virus outbreak.. 190 cases in a single day..!

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి అంతమైందని అనుకుంటున్న తరుణంలో కొత్తకొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. తాజాగా కేరళ(Kerala)లో గవదబిళ్లల వ్యాధి విస్తరిస్తోంది. దీనిని హిందీలో కంఠమాల(Kantamala)లేదా గల్సువా(Galsuva) అని పిలుస్తుంటారు. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 190 కేసులు నమోదైనట్లు సమాచారం.

Infection in Kerala: Another virus outbreak.. 190 cases in a single day..!

పారామిక్సో(Paramixo) అనే వైరస్ వల్ల గవదబిళ్లలు వ్యాపిస్తాయి. ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొకరికి తాకడం ద్వారా లేదా గాలి ద్వారా సంక్రమింపజేస్తుంది. ఇందులో జ్వరం, తలనొప్పి, ఆయాసం, శరీరంలో నొప్పి, లాలాజల గ్రంథుల్లో వాపు వంటి లక్షణాలు ఉంటాయి. మూడు నాలుగు గంటల తర్వాత కనిపించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు దాని లక్షణాలు రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. ఒక్కోసారి వైరస్ సోకినా లక్షణాలు కనిపించకపోవచ్చు.

70 శాతం కేసుల్లో బుగ్గల వాపు వస్తుంది. దీని వల్ల మెదడులో వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా టీనేజర్లను ప్రభావితం చేస్తుంది. కేరళలోని మలప్పుమ్‌లో గవదబిళ్లలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఇప్పటివరకు 2505 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు నెలల వ్యవధిలో 11467 మంది కేసులు నమోదయ్యాయి.

కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను అప్రమత్తం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గవదబిళ్ళకు వ్యాక్సిన్‌ను ప్రైవేట్‌ కేంద్రాలలో పిల్లలకు ఇవ్వవచ్చు. తగినంత నీరు లేదా ద్రవాన్ని తీసుకుంటూ ఉండాలి. వ్యాధి సోకిన తర్వాత తగిన విశ్రాంతి తీసుకోవాలి. సులభంగా మింగగలిగే వాటిని తినాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

You may also like

Leave a Comment