Telugu News » Chickenpox: విజృంభిస్తున్న చికెన్ పాక్స్.. 6,744 కేసులు, 9 మంది మృతి..!

Chickenpox: విజృంభిస్తున్న చికెన్ పాక్స్.. 6,744 కేసులు, 9 మంది మృతి..!

. ఈ ఏడాది ప్రారంభంలో ఉష్ణోగ్రతలు(Temperature) తారాస్థాయికి చేరుకున్నాయి. వరిసెల్లా-జోస్టర్ వైరస్(Varicella-zoster virus) ద్వారా వ్యాపించే ఈ చికెన్ పాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

by Mano
Chickenpox: Booming chicken pox.. 6,744 cases, 9 deaths..!

కేరళ(Kerala)లో చికెన్ పాక్స్(Chickenpox) కేసులు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉష్ణోగ్రతలు(Temperature) తారాస్థాయికి చేరుకున్నాయి. వరిసెల్లా-జోస్టర్ వైరస్(Varicella-zoster virus) ద్వారా వ్యాపించే ఈ చికెన్ పాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Chickenpox: Booming chicken pox.. 6,744 cases, 9 deaths..!

కేరళలో మార్చి 15 వరకు 6,744 ఇన్ఫెక్షన్ కేసులు, పిల్లలతో సహా తొమ్మిది మృతిచెందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది కేరళ రాష్ట్రంలో మొత్తం నాలుగు మరణాలు, 26,363 చికెన్ పాక్స్ కేసులు నమోదైనట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గణాంకాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇది ఒక అంటువ్యాధి. గాలి లేదా వైరస్ సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని కేరళలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ‘శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణుల విషయంలో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి హాని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, సమస్యలు మరణానికి కూడా దారితీయవచ్చు’ అని వైద్యులు చెబుతున్నారు.

రోగులు తమను తాము ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో సహాయపడతారని అంటున్నారు. దాదాపు అన్ని సీజన్లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ వైరస్‌ వ్యాప్తికి అనుకూలం కాబట్టి జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ ద్వారా చికెన్ పాక్స్ సోకకుండా నిరోధించవచ్చని, మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వ్యాధిని తొలిదశలోనే గుర్తించే మంచిదని తెలిపారు.

You may also like

Leave a Comment