Telugu News » Krishna Waters War : ఆటో రాముడు.. డ్రామాలు మానడు.. కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ స్ట్రాంగ్ కౌంటర్..!

Krishna Waters War : ఆటో రాముడు.. డ్రామాలు మానడు.. కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ స్ట్రాంగ్ కౌంటర్..!

కృష్ణా ప్రాజెక్టుల‌ను కేఆర్ఎంబీకి అప్పగించ‌వ‌ద్దని ఇరిగేష‌న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి ఉద‌యం స‌భ‌లో తీర్మానం ప్రవేశ‌పెట్టారు. ఈ తీర్మానంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

by Venu

రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా జలాల (Krishna Waters) వివాదం కుదిపేస్తోంది. ఏపీ (AP), తెలంగాణ (Telangana) అసెంబ్లీల్లో ఇదే అంశంపై వాడివేడి చర్చలు కొనసాగుతున్నాయి. మంత్రుల మధ్య జరిగే మాటల వార్ కు.. వాటర్ వార్ తోడై నేతలు పూనకం వచ్చినట్లు ఊగిపోవడం అసెంబ్లీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ అసెంబ్లీలో కేఆర్ఎంబీ (KRMB)కి ప్రాజెక్టులను అప్పగింత విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం రణరంగాన్ని మరిపించింది.

గత ప్రభుత్వమే ఒప్పందం ఫై సంతకం పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇలా ఒకానొక దశలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు వ్యక్తిగత విమర్శలు సైతం చేస్తున్నారు. చివరకు కృష్ణా ప్రాజెక్టుల‌ను కేఆర్ఎంబీకి అప్పగించ‌వ‌ద్దని ఇరిగేష‌న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి ఉద‌యం స‌భ‌లో తీర్మానం ప్రవేశ‌పెట్టారు. ఈ తీర్మానంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ మేరకు ట్విట్టర్‌‌ (X) వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఛలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అందుకే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.. ఇదే ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ పోస్ట్ కు స్పందించిన ఓ నెటిజన్.. కేటీఆర్‌ (KTR)కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆటో రాముడు.. డ్రామాలు మానడు అని కామెంట్ కింద పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పదేళ్లలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు వివిధ సందర్భాల్లో నాటి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్​మోహన్​ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌లను ప్రదర్శిస్తూ.. కాంగ్రెస్ మంత్రులు ఈ సమస్యకు గత ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు..

You may also like

Leave a Comment