Telugu News » Telangana : పనిచేయని కేసీఆర్ స్ట్రాటజీ.. కాంగ్రెస్ కి బలాన్ని పెంచుతున్న కేటీఆర్..?

Telangana : పనిచేయని కేసీఆర్ స్ట్రాటజీ.. కాంగ్రెస్ కి బలాన్ని పెంచుతున్న కేటీఆర్..?

అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఓడిపోయిందంటే అందుకు కారణం ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోయిందని అర్థం కాదు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ నినాదం అన్నది ఈరోజు పుట్టింది కాదు. రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణ ప్రజలు కన్నీళ్లు పెట్టిన రోజుల్లోనే ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ వాదం మొగ్గతొడిగింది.

by Venu
brs congress

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకొంటున్నాయని అనుకొంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ (Congress) బలం మరింత పెరగనుందని.. బీఆర్ఎస్ (BRS) తెలంగాణ తెచ్చిన పార్టీగా మాత్రమే ప్రజలకు గుర్తుంటుందని.. అంతకు మించి ఆ పార్టీకి ప్రజల్లో ఎక్కువగా నమ్మకం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణం.. బీఆర్ఎస్ పెద్దల స్వయం కృతాపరాధం అని అంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంటు పేరుతో ఇన్నాళ్లు ఇతర పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తామే ఆత్మరక్షణలో పడిపోయినట్లు తెలుస్తోంది.

congress-leaders-are-criticizing-brs-leaders

సెంటిమెంటు ఊపిరితో ఇన్నాళ్లు కళకళలాడిన గులాబీ కండువాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా కళావిహీనమైపోయాయి. ఈ ఎన్నికల తర్వాత జరిగిన ఈ పరిణామాల్ని గమనిస్తే ఓ విషయం స్పష్టమౌతుంది. నీతిగా, న్యాయంగా ప్రజలకోసం పోరాడే నేతలకు వారు ఎప్పుడూ జేజేలు పలుకుతారు. కానీ ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్వప్రయోజనాల కోసం ప్రజలనే పావులుగా చేసి ఆడుకోవాలని చూస్తే మాత్రం ఓటుతో బుద్ధి చెబుతారన్నది ఈ ఫలితాలు స్పష్టం చేశాయి

అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఓడిపోయిందంటే అందుకు కారణం ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోయిందని అర్థం కాదు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ నినాదం అన్నది ఈరోజు పుట్టింది కాదు. రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణ ప్రజలు కన్నీళ్లు పెట్టిన రోజుల్లోనే ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ వాదం మొగ్గతొడిగింది. అందుకే ఆ పేరు చెప్పి ఓట్లడిగిన నేతలందరినీ ఈనాటి వరకు రాష్ట్ర ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు.

కానీ సెంటిమెంటును ఆధారం చేసుకొని నేతలు తమ పబ్బం గడుపుకోవాలని ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడే ప్రజల్లో మార్పు వచ్చింది. అయితే రాజకీయ నేతలు వెల్లడించినట్టుగా తమ మనసులో మాటను బయటపెట్టకుండా సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా కోలుకోని దెబ్బతీయడం ఓటర్ల అలవాటు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహాన్ని అమలుపరించిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయలేని పనులు.. తమను గద్దెనెక్కిస్తే చేస్తామని హామీలిచ్చింది. అవినీతిని చూపించి అధికారంలోకి వచ్చింది.

మరోవైపు ఇంకా సెంటిమెంటుని నమ్ముకొన్న కేసీఆర్ (KCR).. అదే స్ట్రాటజీతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణ.. నిన్న జరిగిన నల్గొండ సభలో మాట్లాడిన తీరు.. పార్టీ ఓటమి చెందిన తర్వాత తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చి.. ఏదో నిప్పు పెడదామని ప్రయత్నం చేశారని అంటున్నారు.. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో బీఆర్ఎస్ నేతలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కార్పొరేట‌ర్ల‌లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. తాము క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. కేటీఆర్ క‌నీసం టైమ్ కూడా ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితో బీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్నార‌ు. వీరిని కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావును కాంగ్రెస్ రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప‌ట్టు పెంచుకోవాల‌నే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు జీహెచ్ఎంసి కౌన్సిల్‌లో బీఆర్ఎస్ ను ఖాళీ చేసి మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ తీరుతో పార్టీ బాలహీనపడుతుండగా.. కాంగ్రెస్ కు బలం పెరుగుతుందని భావిస్తున్నారు..

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ అనుబంధంగా మారిపోయిందని తెలుస్తోంది..మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. దీంతో తెలంగాణ రాజకీయంలో స్పష్టత వచ్చింది. మజ్లిస్ ఇక ఎంత మాత్రం బీఆర్ఎస్ మిత్రపక్షం కాదని, అందుకే దూరం పాటిస్తోందని తేలిపోయింది. మేడిగడ్డ టూర్ పెట్టుకుంది బీఆర్ఎస్ ..కేసీఆర్ కు వ్యతిరేకంగా . అలాంటి టూర్ కు మజ్లిస్ వెళ్లడం అంటే.. కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా తేల్చడమే అని ఫిక్స్ అవుతున్నారు.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించినట్లే అని భావిస్తున్నారు.

You may also like

Leave a Comment