Telugu News » Alleti Maheshwar Reddy : బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ నియామకం.. రాజాసింగ్ కు దక్కని అవకాశం..!

Alleti Maheshwar Reddy : బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ నియామకం.. రాజాసింగ్ కు దక్కని అవకాశం..!

బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ (Raja Singh) హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు.

by Venu

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బీజేపీ (BJP) శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ ఎవరు అనే ఉత్కంఠకు రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (Kishan Reddy) నేటితో ముగింపు పలికారు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డిని బీజేఎల్‌పీ నేత‌గా నియ‌మిస్తూ కిష‌న్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. బీజేఎల్‌పీ ఉప‌నేత‌లుగా పాయ‌ల్ శంక‌ర్, వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి నియామ‌కం అయ్యారు.

శాస‌న‌మండ‌లి పక్ష‌నేత‌గా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామ‌కం అయ్యారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌హేశ్వ‌ర్ రెడ్డి (Maheshwar Reddy) గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో అత్యధికంగా 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా ఎక్కువ అవకాశాలున్నాయ‌ని గ‌తంలో ప్రచారం జరిగింది.

బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ (Raja Singh) హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు.

ఇందులో రాజాసింగ్‌, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇకపోతే 2009లో మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌లకు కొన్ని నెల‌ల ముందే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

You may also like

Leave a Comment