Telugu News » Medaram Jathara : మేడారం వెళ్లే భక్తులకు‌ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్..!

Medaram Jathara : మేడారం వెళ్లే భక్తులకు‌ పర్యాటకశాఖ గుడ్‌న్యూస్..!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఒకప్పుడు కాలినడకన, ఎడ్ల బండ్లలో వెళ్లేవారు. ఆ తర్వాత బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్తున్నారు. అప్పటికి కూడా సౌకర్యాలు అంతంత మాత్రమే.. కానీ ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోన్నారు.

by Venu

తెలంగాణ (Telangana) పర్యాటకశాఖ మేడారం (Medaram) వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. జాతరకు బస్సుల్లోనే కాదు ఇక నుంచి హెలికాప్టర్‌ (Helicopter)లోనూ వెళ్లొచ్చని పేర్కొంది. ఈమేరకు హనుమకొండ (Hanumakonda) నుంచి మేడారంకు హెలికాప్టర్‌‍లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Good news for devotees coming to medaram

కాగా మేడారం జాతరను ఈ సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ ప్రయాణంపై దృష్టి సారించింది. మరోవైపు హెలికాప్టర్‌లో మేడారం సందర్శించిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం సైతం కల్పించారు. అదీగాక భక్తుల కోసం ప్రత్యేకంగా హెలీకాప్టర్‌ జాయ్‌రైడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ జాయ్‌రైడ్‌ చేసేవారు విహంగ వీక్షణంతో జాతర పరిసరాలను ఆస్వాదించవచ్చు. గత మూడు జాతరల నుంచి భక్తులకు హెలికాప్టర్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతో ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా ఈ ప్రయాణానికి ధరలు ఇంకా నిర్ణయించలేదు. మరో రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు సమాచారం.

ఇకపోతే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఒకప్పుడు కాలినడకన, ఎడ్ల బండ్లలో వెళ్లేవారు. ఆ తర్వాత బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్తున్నారు. అప్పటికి కూడా సౌకర్యాలు అంతంత మాత్రమే.. కానీ ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోన్నారు. ఒకప్పుడు గిరిజన జాతర అయిన మేడారంను.. నేటి కాలంలో అన్ని కులాల వారు సందర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటున్నారు.. ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని ఈ జాతర ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా జరగనుంది.

You may also like

Leave a Comment