Telugu News » Rashmika Mandanna : మరణం నుంచి తప్పించుకొన్న రష్మిక మందన్న.. పోస్ట్ వైరల్..!

Rashmika Mandanna : మరణం నుంచి తప్పించుకొన్న రష్మిక మందన్న.. పోస్ట్ వైరల్..!

రష్మికతో పాటు శ్రద్ధా దాస్ కలిసి ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటోను రష్మిక షేర్ చేశారు. ఈ విధంగా మేము ఈరోజు చావు నుంచి తప్పించుకొన్నాము అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు.

by Venu
rashmika

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తన అభిమానులకు షాకిచ్చింది. తాను తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డానని చేసిన పోస్ట్ వైరల్ ( Viral)గా మారింది. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ (Flight) ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) అయ్యిందని తెలిపిన రష్మిక.. ఆ క్షణం తాను ఎంతో టెన్షన్ పడినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియచేశారు.

Rashmika: Rashmika morphing videos.. Central IT department is serious..!

ఇక యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకొన్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాలు కూడా దక్కించుకొన్న ఈ నేషనల్ క్రష్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. ఫ్లైట్‌ టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిందని వెల్లడించారు.

మరోవైపు ఈ ఫ్లైట్‌లో రష్మిక మందన్నతో పాటుగా శ్రద్ధా దాస్ (Shraddha Das) ఉన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఇదే విషయాన్ని రష్మిక సైతం పోస్ట్ చేశారు. ఇక రష్మికతో పాటు శ్రద్ధా దాస్ కలిసి ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటోను రష్మిక షేర్ చేశారు. ఈ విధంగా మేము ఈరోజు చావు నుంచి తప్పించుకొన్నాము అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరోవైపు గత రెండు రోజుల క్రితం నేషనల్ క్రష్ రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకొన్న విషయం తెలిసిందే.. ఆమె వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియా (Forbes India) వెర్షన్ కవర్ పేజీ పై కనిపించే అవకాశం నేషనల్ క్రష్ ముంగిట వాలింది. ప్రెజెంట్ ఇండియాలో టాప్ పొజిషన్ కు ఎదుగుతున్న యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్స్ పై ఫోర్బ్స్ ఇండియా స్పెషల్ ఆర్టికల్ ను ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినీ ఇండస్ట్రీ నుంచి రష్మిక మందన్నా స్థానం దక్కించుకొన్నారు.

You may also like

Leave a Comment