Telugu News » Minister Konda Surekha : అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖ.. డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ..!

Minister Konda Surekha : అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖ.. డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ..!

గత ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగ్యూ పాజిటివ్‌ (Dengue Fever)గా నిర్ధారించారు. మరోవైపు ప్రతిష్టాత్మక మేడారం జాతర ప్రారంభం కానుండటంతో మంత్రి ఆ పనులపై ఫోకస్ చేస్తున్నారు.

by Venu

తెలంగాణ (Telangana) అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ మంత్రి (Minister) కొండా సురేఖ (Konda Surekha) అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆమె జ్వరంతో బాధ పడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడిన మంత్రి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు.

Konda Surekha: White paper should be released on past government leaders: Minister Konda Surekha

అయితే గత ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగ్యూ పాజిటివ్‌ (Dengue Fever)గా నిర్ధారించారు. మరోవైపు ప్రతిష్టాత్మక మేడారం జాతర ప్రారంభం కానుండటంతో ఆ పనులపై ఫోకస్ చేస్తున్నారు. జ్వరంతో బాధ పడుతూనే మేడారం జాతర (Medaram Jatara) పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలు అధికారులను అడిగి మంత్రి తెలుసుకొంటున్నారు.

ఈమేరకు కొండా సురేఖ, జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు. అనంతరం మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొననున్నట్లు సమాచారం. ఇక మేడారం జాతర పనులు మొదలైనప్పటి నుంచి కొండా సురేఖా, సీతక్క ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment