Telugu News » USA: 50ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి అమెరికా అంతరిక్ష నౌక..!

USA: 50ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి అమెరికా అంతరిక్ష నౌక..!

ఫ్లోరిడాలోని నాసా ‘కెన్నెడీ స్పేస్ సెంటర్’ నుంచి గత గురువారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ తొమ్మిది రాకెట్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించారు.

by Mano
USA: After 50 years, the American spacecraft landed on Zabili..!

అమెరికా(USA) దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మరోసారి అంతరిక్ష నౌక జాబిల్లిపైకి విజయవంతంగా పంపింది. ‘ఇంట్యూటివ్ మెషీన్స్‌’(Intuitive Machines)కు చెందిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’(Odysseus) చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

USA: After 50 years, the American spacecraft landed on Zabili..!

ఫ్లోరిడాలోని నాసా ‘కెన్నెడీ స్పేస్ సెంటర్’ నుంచి గత గురువారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ తొమ్మిది రాకెట్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఐఎం-1 (IM-1) పేరుతో ఈ మిషన్‌ను నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:23 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది.

చివరి సారిగా అమెరికా 1972 డిసెంబర్‌లో అపోలో మిషన్‌లో భాగంగా ‘అపోలో-17’ అంతరిక్ష నౌకను చంద్రుడి ఉపరితలంపైకి పంపించింది. ప్రైవేటు కంపెనీ అయిన ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ చంద్రుడిపైకి పంపించిన మొట్టమొదటి రోబోటిక్ ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం.

తాజాగా పంపిన అంతరిక్ష నౌకకు వాతావరణ చర్యలు, రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి పంపించారు. ల్యాండింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, నావిగేషన్‌కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయనున్నట్లు నాసా రిపోర్టులు చెబుతున్నాయి. నాసా, ఇతర కమర్షియల్ కంపెనీలకు చెందిన పరికరాలను ఒడిస్సియస్ చంద్రుడిపైకి మోసుకెళ్లింది.

You may also like

Leave a Comment