Telugu News » Shanmukh Jaswanth : మాదక ద్రవ్యాల కేసులో షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట..!

Shanmukh Jaswanth : మాదక ద్రవ్యాల కేసులో షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట..!

షణ్ముఖ్‌కు.. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో అప్పటికే పరిచయముంది. అతడి ద్వారా 2015లో సంపత్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

by Venu
Shanmukh Jaswant: 'Hey what's this..' Shanmukh Jaswant caught with ganja..!

ప్రముఖ యూట్యూబర్ (YouTuber), బిగ్‌బాస్‌ ఫేమ్‌ (Bigg Boss Fame) షణ్ముఖ్ జస్వంత్‌ (Shanmukh Jaswanth)కు మాదక ద్రవ్యాల కేసులో ఊరట లభించింది. నిన్న మత్తు పదార్థాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది క‌ల్యాణ్ దిలీప్ సుంకర ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. న్యాయవాది షేర్ చేసిన ఫొటోలో ష‌ణ్ముఖ్ ఉన్నాడు.

Shanmukh Jaswant: 'Hey what's this..' Shanmukh Jaswant caught with ganja..!

ఇకపోతే విశాఖపట్నం (Visakhapatnam)కు చెందిన సంపత్‌ వినయ్‌ (31) యూట్యూబ్‌ వీడియోలు చేస్తుంటాడు. అతడు షణ్ముఖ్‌ కు సోదరుడు. వీరిద్దరూ నగర శివారైనా పుప్పాలగూడలో ఉంటున్నారు. అయితే షణ్ముఖ్‌కు.. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో అప్పటికే పరిచయముంది. అతడి ద్వారా 2015లో సంపత్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఈ నేపథ్యంలో సంపత్‌, మౌనికకు నిశ్చితార్థం కూడా జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. మౌనిక తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో పెళ్లి వాయిదా పడింది. అనంతరం ఫిబ్రవరి 24న పెళ్లి తేదీ నిర్ణయించారు.. అప్పటి నుంచి మౌనికను సంపత్‌ వినయ్ పలు కారణాలతో దూరం పెట్టడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.. అదే సమయంలో ఫిబ్రవరి 27న మరో యువతితో సంపత్‌కు వివాహం చేస్తున్నామని అతడి తల్లిదండ్రులు యువతికి తెలియచేసారు.

దీంతో తాను మోసపోయానని గుర్తించిన మౌనిక.. గురువారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపత్ ఫ్లాట్‌కు వెళ్ళిన పోలీసులకు.. షణ్ముఖ్‌ గంజాయితో దొరికాడు. వెంటనే అతన్నిమాదక ద్రవ్యాల కేసులో అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ కేసులో షణ్ముఖ్‌కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది దిలీప్ సుంకర కేసు వాదిస్తున్నారు. అయితే షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

You may also like

Leave a Comment