Telugu News » Shanmuk Jaswant: ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..’ పోలీసుల ముందు షణ్ముక్ కంటతడి..!

Shanmuk Jaswant: ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..’ పోలీసుల ముందు షణ్ముక్ కంటతడి..!

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్(Shanmuk Jaswant) గంజాయి కేసు వ్యవహారం పెను దుమారం రేపుతోంది. పోలీసుల విచారణలో షణ్ముక్ కీలక విషయాలను వెల్లడించాడు. డిప్రెషన్ కారణంగానే మత్తు పదార్థాలు తీసుకున్నా’ అంటూ షణ్ముక్ పోలీసుల ఎదుట కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

by Mano
Shanmuk Jaswant: 'I want to commit suicide...' Shanmuk burst into tears in front of the police..!

బిగ్‌బాస్ ఫేమ్(Bigboss Fame), ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్(Shanmuk Jaswant) గంజాయి కేసు వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఓ కేసులో షణ్ముక్ సోదరుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు షణ్ముక్ గంజాయి, మాదకద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

Shanmuk Jaswant: 'I want to commit suicide...' Shanmuk burst into tears in front of the police..!

ఈ మేరకు పోలీసుల విచారణలో షణ్ముక్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘ప్రస్తుతం నేను డిప్రెషన్‌లో ఉన్నా.. ఒక్కోసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది.. డిప్రెషన్ కారణంగానే మత్తు పదార్థాలు తీసుకున్నా’ అంటూ షణ్ముక్ పోలీసుల ఎదుట కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షణ్ముక్ తన యాక్టింగ్‌తో సెలెబ్రిటీగా మారినా.. పోలీస్ కేసులతో వార్తలకెక్కుతున్నాడు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈ యంగ్ యాక్టర్‌ అప్పుడు ఎలాగో అలా బయటికొచ్చాడు.  ఆ తర్వాత మళ్లీ తన యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న షణ్ముక్‌కు ఊహించని షాక్ తగిలింది.

షణ్ముక్ అన్న సంపత్ వినయ్ ప్రేమ పేరుతో  మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది. తనను కాదని మరొకరితో పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ క్రమంలో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లారు. అయితే, తనిఖీల్లో ప్లాట్‌లో ఉన్న షణ్ముక్ వద్ద గంజాయి, మత్తు పదార్థాలు దొరికాయి.

దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు షణ్ముక్ పోలీసుల ముందు తన ఆవేదనను చెప్పుకుంటూ కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎంత డిప్రెషన్ ఉన్నా దారితప్పి మత్తు పదార్థాలకు బానిసవడం సరికాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You may also like

Leave a Comment