రాష్ట్రంలో ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ ఎంట్రీ ఇస్తున్నారు.. వాస్తవానికి గత కొద్దిరోజులకు ముందు వరకు ఖమ్మం నుంచి సోనియా గాంధీని (Soniya Gandhi) బరిలోకి దించే ప్రయత్నాలను టీపీసీసీ చేసింది. ఈ విషయంపై జోరుగా చర్చలు సైతం సాగాయి.
అయితే ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అందులో ఆరోగ్యం, వయసు రీత్యా ఈ నిర్ణయం సరైంది కాదనే భావనకు వచ్చారు.. దీంతో ప్రస్తుతం ప్లాన్ ఛేంజ్ అయ్యిందని సమాచారం.. మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎంపీగా ఉన్నారు. కాగా ఈ స్థానంలో కమ్యూనిస్టులు పోటీ చేయనున్నారు. అందుకే తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందులో ప్రస్తుతం ఇక్కడ హస్తం హవా సాగుతుంది.. ఈ క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ ఉంది. ఇక ఈ విషయంలో రాహుల్ టీం ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు సర్వే రిపోర్టులు ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొన్న అనంతరం..ఖమ్మం (Khammam), భువనగిరి (Bhuvanagiri) స్థాలను ఎంపిక చేసుకొన్నారు. ఇక ఈ రెండు కాంగ్రెస్ కి కంచుకోటలే. గెలిచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు ఖమ్మం ఇంకా బలమైన సీటు. అక్కడ ఇప్పటికి పార్టీ తరపున సరైన ప్రత్యర్థి లేరు. అయితే గతంలో పట్టున్న బీఆర్ఎస్ ప్రస్తుతం వలసలతో పూర్తిగా బలహీనపడింది. మరోవైపు బీజేపీ ఉనికి దాదాపుగా లేదు. దీంతో ఖమ్మంలో రాహుల్ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంకా గాంధీ యూపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.