Telugu News » DK Aruna : కాంగ్రెస్-బీఆర్ఎస్ దోస్తీ బయట పెట్టిన డీకే అరుణ..!

DK Aruna : కాంగ్రెస్-బీఆర్ఎస్ దోస్తీ బయట పెట్టిన డీకే అరుణ..!

ప్రజల్లోకి కేంద్రం చేసిన అభివృద్ధిని తీసుకెళ్ళి అందినకాడికి ఓటు బ్యాంక్ రాబట్టుకోవాలనే వ్యూహంలో కాషాయం దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

by Venu
dk aruna fire on cm kcr

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రారంభించిన విజయ సంకల్స యాత్ర జోరుగా సాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న నేతలు.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల్లోకి కేంద్రం చేసిన అభివృద్ధిని తీసుకెళ్ళి అందినకాడికి ఓటు బ్యాంక్ రాబట్టుకోవాలనే వ్యూహంలో కాషాయం దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

DK Aruna: Is that why the Congress party gave six guarantees?: DK Aruna

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ లక్ష్యంగా విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య లోకానికి తెలియని లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.. జగిత్యాల (Jagtial) జిల్లా, మెట్‌పల్లి (Metpalli)లో ప్రారంభమైన బీజేపీ (BJP) విజయ సంకల్స యాత్రలో డీకే అరుణ (DK Aruna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్ధపు హామీలతో, మోసపూరిత మాటలతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు..

రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలను ఆమలు చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని పేర్కొన్నారు. మరోవైపు తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అక్కర్లేని కాళేశ్వరం ( kaleshwaram) ప్రాజెక్ట్‌కు రూ.లక్షల కోట్లు కుమ్మరించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు..

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అంటూ రాష్ట్ర పరువు గంగలో కలిపిన మేడిగడ్డ ప్రాజెక్ట్ అసలు పనికిరాదంటూ కేంద్రం నుంచి వచ్చిన డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకొంటున్నారు.. ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అవినీతి అంటూ గొంతు పగిలేలా అరచిన కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా.. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతిపై ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించట్లేదని ప్రశ్నించారు. ఇక్కడే కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ బయటపడుతోందని మండిపడ్డారు..

You may also like

Leave a Comment