ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమికి మరో షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్ లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar polls)పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఐ.ఎన్.డి.ఐ.ఏ ( india)కూటమి బలాన్ని మరింత తగ్గించనుంది. ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ దేశ రాజధానిలో బీహార్ కు చెందిన ఆప్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీహార్ లో పార్టీని బలోపేతం చేయాలని పాఠక్ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. మురికి రాజకీయాల కారణంగా రాష్ట్రం ముందుకు సాగకపోవటం బీహార్ చేసుకున్న దురదృష్టం. అందుకే వచ్చే బీహార్ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ బలంగా మారాలి” అని పాఠక్ అన్నారు.
పార్టీని మరింత విస్తరించేందుకు ప్రతి గ్రామంలో తప్పని సరిగా కమిటీలను ఏర్పాటు చేయాలని బీహార్‌లోని పార్టీ నాయకులను పాఠక్ కోరారు. బీహార్ లో ఎన్నికల్లో పోటీ చేస్తాం. కానీ ఎప్పుడూ ఎలా పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.
బీహార్ లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేం. అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సొంతంగా కమిటి వేయాలి. పార్టీని మరింత బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఇప్పటి నుంచే కష్టపడండి. ఒకసారి పార్టీ బలంగా మారితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామని ఆయన అన్నారు.
మరోవైపు, బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ దీనిపై స్పందించాయి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఆప్ ప్రకటనను తప్పుపట్టాయి. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా కొన్ని విధానాలను రూపొందించుకున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు. ఈ విధానాలకు ఆప్ కట్టుబడి ఉండాలని సూచించారు.