తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత.. ప్రజలకు అనుకూలంగా పాలన చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఆరు గ్యారంటీలలో భాగంగా మొదట మహాలక్ష్మీ పథకం పేరుతో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చారు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం.. మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అమ్మాయిలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు.
అయితే ఈ పథకం మీద ఎన్ని విమర్శలు వస్తున్న ప్రభుత్వం ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్తుంది. అదీగాక ఇప్పటికే ఆర్టీసీకి మహాలక్ష్మీ పథకం కింద భారీగా ఆదాయం వస్తుందని సమాచారం.. ఇదిలా ఉండగా తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అలాగే ప్రశ్నా పత్రంను కూడా షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆన్సర్ చెప్తూనే ఇంకా వేరే ప్రశ్నలు కూడా అడగొచ్చు కదా సార్ అంటూ స్పందిస్తున్నారు.. ఇదిలా ఉండగా కాంగ్రెస్ (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో మొదట అమలు అయ్యింది మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
తెలంగాణ (Telangana) సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు స్వీకరించిన తర్వాతి రోజే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. కాగా గడిచిన మూడు నెలలుగా పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. మహిళలతో బస్సులు కిక్కిరిసి పోతున్నాయి.