తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తుంది. అగ్రనాయకత్వం సైతం ప్రత్యేక దృష్టి సారించి వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శల బాణాలతో విరుచుకుపడుతున్నారు.. ఈ క్రమంలో సికింద్రాబాద్, ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) బీజేపీ టార్గెట్ ఎంతో వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగా బీజేపీ (BJP) సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిపిన అమిత్ షా.. మళ్లీ అధికారం బీజేపీదే అనే ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో12 ఎంపీ సీట్లు, దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం అని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ఆరోపించారు..
బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని మిమర్శించిన కేంద్ర మంత్రి.. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది దుర్వినియోగమే అవుతుందని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు. కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లతో బీజేపీ గెలవాలని అన్నారు..
ఈ పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు చేశాం. అన్ని రంగాల్లో భారత్ అభివృద్ది పథంలో పయనిస్తోందని అమిత షా వివరించారు. భారత్‌ను మూడో అదిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మాట ఇచ్చారు.. అవినీతిరహిత భారత్ నిర్మాణమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు..
కాంగ్రెస్ (Congress) అవినీతిపై జవాబు చెప్పాకే రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీపై విమర్శలు చేయాలని అన్నారు. తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం 10వేల కోట్ల రూపాయిలు సాయం చేసిందని తెలిపారు. పాకిస్తాన్ నుంచి చొరబాట్లను తిప్పికొట్టాం. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని మోడీ (Modi) అంతం చేశారు. 2047 నాటికి విశ్వగురువుగా భారత్ అవుతుందని అమిత షా ఈ సందర్భంగా వివరించారు..