వర్ధన్నపేట (Vardhannapet) మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aruri Ramesh) పొలిటికల్ స్టెప్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. పట్టణంలోని ఆయన ఇంటి దగ్గర హైడ్రమా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS)కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆయనను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య (MLC Baswaraju Saraiah), ఇతర నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
అయిన వినకుండా రమేష్ ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైయ్యారు. దీంతో నేతలు ఇంట్లోకి తీసుకెళ్ళి రాజీనామాను విరమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు వెల్లడించినట్లు సమాచారం.. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాగా ఆయన బీజేపీ (BJP)లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఆరూరిని ఆయన ఇంటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ (Hyderabad)కు తరలిస్తుండగా ఈరోజు మధ్యాహ్నం జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకొన్నారని సమాచారం.. అనంతరం వారి వాహనంలో ఎక్కించుకొని హైదరాబాదుకు బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది.
రమేష్ ను బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వద్దకు తీసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకొంటున్నాయి.. ఇప్పటికే నోటికి పని చెప్పి విమర్శల వరకు వెళ్ళిన నాయకులు.. తాజాగా మరో అడుగు ముందుకేసి వివాదాస్పదంగా మారుతున్నారని అనుకొంటున్నారు..