పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ(Telangana)లో రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. ఎంపీ టికెట్(MP Ticket) కోసం అభ్యర్థుల పోటీ పెరిగింది. ఆశావహులు టికెట్ దక్కే పరిస్థితి లేకుంటే పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు.
మరోవైపు బీఎస్పీ(BSP)ని బీఆర్ఎస్లో కలపడంతో కొందరు నేతలకు నచ్చడంలేదు. ఈ క్రమంలో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకిస్తున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొమరంభీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు.
రేపు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. కోనప్పతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కోనప్ప కాంగ్రెస్‌లో రోజే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరుతానే చర్చ సాగుతోంది.
పైళ్లశేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సైతం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఇంకెంత మంది బీఆర్ఎస్ నేతలు ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది.