బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటేనని అంటున్న వారిపై భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్న బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో ఆరెగూడెం గ్రామంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అనే వారిని చెప్పుతో కొడతానంటూ నర్సయ్యగౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్తో పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టంశారు. కాంగ్రెస్ నాయకులు భువనగిరి అభివృద్ధి తమ వల్లే జరిగిందని చెప్పుకుంటున్నారని, తన కంటే మందున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
భువనగిరిలో బీజేపీ గెలవకపోతే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను గెలిస్తే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? అని సవాల్ విసిరారు. తన సవాలును స్వీకరించే దమ్ము, ధైర్యం కోమటిరెడ్డికి ఉందా? అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
తాను భువనగిరి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి బీబీనగర్ ఏయిమ్స్, ఎంఎంటీఎస్ రైలు, కేంద్రీయవిద్యాలయం, 520కిలోమీటర్ల జాతీయ రహదారులు తీసుకువచ్చానని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని ప్రజలను కోరారు.