Telugu News » Telangana : భూ కబ్జా రాయుళ్ల పై కాంగ్రెస్ సర్కార్‌ యాక్షన్‌..!

Telangana : భూ కబ్జా రాయుళ్ల పై కాంగ్రెస్ సర్కార్‌ యాక్షన్‌..!

ఈ వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న 35 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ (Pragathi Bhavan), ప్రజా భవన్ గా మార్చి ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రజావాణిలో సామాన్యులు చేసుకున్న దరఖాస్తులపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఆదిబట్లలో బీఆర్ఎస్ (BRS) నేతలపై భూకబ్జా కేసులు నమోదయ్యాయి..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూబాధితులంతా బహిరంగ విచారణకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ (Hyderabad) మొదలుకొని అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.. ప్రభుత్వ, ప్రయివేటు భూములతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని ప్రచారంలో ఉంది..

మరోవైపు భూముల కబ్జాలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ నేత కన్నారావు (Kannarao)తో పాటు మరో 35 మందిపై కేసులు నమోదు చేసారు. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటి వరకు కన్నారావుతో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆదిబట్లలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, తన గ్యాంగ్ యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు 307. 447. 427. 436. 148.149 ఐపిసి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ పేరుతో ఓ బిల్డర్ డెవలప్ చేస్తున్నట్లు గుర్తించారు. భూమి చుట్టూ పెట్టిన బ్లూ షీట్స్ కు కన్నారావు గ్యాంగ్ నిప్పు పెట్టిన కాల్చినట్లు గుర్తించారు. కాగా ఈ వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న 35 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. కన్నారావు ఎక్కడికి వెళ్లిపోయాడు? అసలు ఎన్ని రోజుల నుంచి ఈ భూకబ్జా భాగోతం నడుస్తోంది? అనేది దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment