పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి అండర్ గ్రౌండ్ కు వెళ్ళిన గులాబీ బాస్ తాజాగా పార్టీ కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొంటున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకు పడటం కనిపిస్తోంది. అయితే కేసీఆర్, కరీంనగర్ సభలో మాట్లాడిన మాటలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ (Karimnagar), బీఆర్ఎస్ (BRS) సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు.. నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రావడం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కేసీఆర్ (KCR) అనడం హాస్యాస్పదమని విమర్శించారు.
ప్రకృతి కారణంగా రాష్ట్రంలో కరువొస్తే.. అది ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం ఆయన స్వార్థ ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకొంటుందని జోస్యం చెప్పారు.. అవినీతి బురదను ఒళ్ళంతా పూసుకొన్న కేసీఆర్ అండ్ కో, మెడిగడ్డలో ఏదో రెండు పిల్లర్లు కుంగితే ఇంత రాద్ధాంతం ఏంటని అనడం సరికాదని సూచించారు..
కేసీఆర్ కు అవగాహన లేక ఎక్కడ చేసిన దోపిడి బయటపడుతుందో అనే ఆందోళనతో ఏదేదో మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా వ్యవసాయ డిగ్రీ కళశాల భవనానికి శంకుస్థాపన చేసిన పొన్నం.. గత శాసన సభ్యుడు మంజూరు చేసిన వ్యవసాయ కళాశాల భవనానికి భూమి పూజ చేశామని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని వెల్లడించారు..