దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్దం అయ్యింది. మరికొద్ది గంటల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) దేశ ప్రజలను ఉద్దేశించినిన్న రాత్రి బహిరంగ లేఖ (Open Letter) రాశారు. దేశ ప్రజలను తన కుటుంబంగా పేర్కొన్న ఆయన అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అందులో వివరించారు.

నా 140 కోట్ల మంది కుటుంబ సభ్యులతో నాకున్న నమ్మకం, మద్దతుతో కూడిన ఈ దృఢమైన సంబంధం నాకు ఎంత ప్రత్యేకమైనదో మాటల్లో చెప్పడం కష్టం అని చెప్పుకొచ్చారు. సాంప్రదాయం ఆధునికతను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని ఉద్ఘాటించారు.. అదేవిధంగా మోడీ తన లేఖలో పలు అంశాలను ప్రస్తాంచారు.. అవి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా శాశ్వత గృహాలు.. అందరికీ విద్యుత్, నీరు, గ్యాస్ సరైన ఏర్పాటు..
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స ఏర్పాటు.. రైతులకు ఆర్థిక సహాయం.. మాతృ వందన యోజన ద్వారా మహిళలకు సహాయం.. ప్రజల నుంచి ఆశీస్సులు, సూచనలు ప్రధాని కోరారు.. ప్రతి పౌరుడికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి దేశం ముందుకు సాగుతున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి నాకు మీ ఆలోచనలు, సూచనలు, మద్దతు అవసరమని అన్నారు. ఇక లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Election ) ముందు మోడీ సుదీర్ఘ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది..