Telugu News » Ananya Nagalla : పవన్ కల్యాణ్ పై వకీల్ సాబ్ నటి సంచలన కామెంట్స్..!

Ananya Nagalla : పవన్ కల్యాణ్ పై వకీల్ సాబ్ నటి సంచలన కామెంట్స్..!

పవన్ ఇప్పటి వరకు పాలిటిక్స్ లో క్రియాశీలకంగా మారలేదని అభిమానులు సైతం హార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఛాన్స్.. ఒక్క విజయం పవన్ రాజకీయ జీవితాన్ని టర్న్ చేస్తుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

by Venu

ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం హాట్ గా మారాయి అంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒకలెక్కగా ఇక్కడి పార్టీల తీరు ఉందని చర్చించు కొంటున్నారు.. వైసీపీ కి ఈ ఎన్నికలు కీలకంగా మారగా.. జనసేనకు (Janasena), టీడీపీ (TDP)కి ప్రతిష్టాత్మకంగా మారాయని లెక్కలు వేసుకొంటున్నారు.. ఇక పవన్ రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు సభలకు, చర్చలకు మాత్రమే పరిమితం అవుతున్నారని అనుకొంటున్నారు.

పవన్ ఇప్పటి వరకు పాలిటిక్స్ లో క్రియాశీలకంగా మారలేదని అభిమానులు సైతం హార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఛాన్స్.. ఒక్క విజయం పవన్ రాజకీయ జీవితాన్ని టర్న్ చేస్తుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బాబుతో పొత్తు.. మరి గెలిస్తే సీఎం ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలను కమ్ముకొందని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం.. సీఎం పవన్ అంటూ అప్పుడే ఫిక్స్ అయ్యారు.. నినాదాలు కూడా చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ నటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలని తెలిపిన యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ( Ananya Nagalla).. ఆయనకు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టమని అన్నారు.. నిత్యం ప్రజల గురించే ఆలోచించే ఆయన.. అగ్ర హీరో హోదాను వదులుకొని రాజకీయాల్లోకి రావడం సాహసమని పేర్కొన్నారు..

అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా అండగా నిలబడాలని కోరారు.. నేనైతే పవన్ సీఎం అవ్వాలని బలంగా కోరుకుంటున్నానని అనన్య నాగళ్ల అన్నారు. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చాక సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటించింది. కాగా తంత్ర చిత్రం విడుదల రోజున ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు ఐమాక్స్ థియేటర్‌కు వచ్చిన ఆమెను.. పవన్ కల్యాణ్‌ గురించి అడగ్గా.. సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment