భారత ఎన్నికల సంఘం(Election Commission of India) వచ్చే లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న తరుణంలో హోం మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. ఇవాళ(శనివారం) కొన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లోనూ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) నాడు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ (X )లో ఒక పోస్ట్ చేశారు. భారత ప్రజలు ఉగ్రవాద శక్తులను నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారు అంటూ అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు యాసిన్ మాలిక్ ఉగ్రవాద సంస్థ జేకేఎల్ఎఫ్పై విధించిన నిషేధాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గానూ మోడీ ప్రభుత్వం ‘జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్’ని నిషేధిత గ్రూపుగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని అమిత్ షా తెలిపారు. మార్చి 12 వ తేదీన మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను చట్టవిరుద్ధమైన గ్రూపుగా పేర్కొంటూ నిషేధం విధించింది.
యాసిన్ మాలిక్‌తో పాటు హోం మంత్రిత్వ శాఖ జేకేపీఎల్(ముక్తార్ అహ్మద్ వాజా), జేకేపీఎల్ (బషీర్ అహ్మద్ తోట), జేకేపీఎల్ (గులాం మహమ్మద్ ఖాన్), జేకేపీఎల్ (అజీజ్ షేక్) వర్గాలను కూడా నిషేధించినట్లు కేంద్ర హోంమంత్వశాఖ వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతకు ఎవరైనా సవాలు విసిరితే చట్టపరంగా కఠిన చర్యలుఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా అన్నారు.
Pursuing PM @narendramodi Ji's policy of zero-tolerance towards terrorism, the MHA has declared four factions of the Jammu and Kashmir Peoples League—namely, JKPL (Mukhtar Ahmed Waza), JKPL (Bashir Ahmad Tota), JKPL (Ghulam Mohammad Khan) and JKPL (Aziz Sheikh) led by Yaqoob…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 16, 2024