Telugu News » Karimnagar : కరీంనగర్‌లో రూ.6.65 కోట్ల నగదు సీజ్.. బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి పై అనుమానాలు..!

Karimnagar : కరీంనగర్‌లో రూ.6.65 కోట్ల నగదు సీజ్.. బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి పై అనుమానాలు..!

త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొన్న అధికారులు.. సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని రూ.6 కోట్ల 65 లక్షల నగదును (Rs. 6.65 Crores) పోలీసులు సీజ్ చేశారు.

by Venu
Hyderabad: Seizure of huge cash in Hyderabad..!

తెలంగాణ (Telangana)లో వాతావరణంతో పాటు.. రాజకీయాల్లో కూడా పలు మార్పులు.. మలుపులు చోటు చేసుకొంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు వస్తున్న వార్తలు వేసవి వేడిని మరిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని ప్రతిమా (Pratima) గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు అర్థరాత్రి నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొన్న అధికారులు.. సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని రూ.6 కోట్ల 65 లక్షల నగదును (Rs. 6.65 Crores) పోలీసులు సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆ నగదు ఎలా వచ్చిందో వివరణ ఇచ్చి, డబ్బును తీసుకెళ్లాలని కూడా అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రతిమ హోటల్స్‌కు కరీంనగర్ బీఆర్ఎస్ (BRS) పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ (Boinapally Vinod Kumar)కు సంబంధాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలన్నీ ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకొంటున్నారు. అయితే ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ డబ్బును ఎన్నికల్లో ఉపయోగించేందుకే తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. నగదు పట్టుబడిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు సీజ్ చేసిన డబ్బులను కోర్టులో సమర్పిస్తామని ఏసీపీ నరేందర్​ వెల్లడించారు..

You may also like

Leave a Comment