తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షల కొరకు తెచ్చుకొన్న ప్రత్యేక రాష్ట్రం.. కేసీఆర్ చేతిలో బందీగా మారి ధగా పడిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు అవ్వడాని ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారు.. ఎంత మంది మరణించారు గుర్తు చేసుకొంటే పిడికిళ్ళు బిగుసుకుంటాయని అన్నారు. అలాంటి పాలనను ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ (BRS) గుర్తు చేసిందని విమర్శించారు.
హైదరాబాద్ (Hyderabad)లో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ).. గత ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు.. నిజాం రాచరిక పాలన 1948 సెప్టెంబర్ 17న అంతమైందని, అలాగే కేసీఆర్ పాలన 2023 డిసెంబర్ 3న అంతమైందని తెలిపారు. తమ వారసులే అధికారంలో ఉండాలని అప్పటి నిజాం నవాబు కోరుకొన్నట్లు.. కేసీఆర్ కూడా ఆశించారని, అందుకే ప్రజలు స్వేచ్ఛను కోరుకొని మూలన కూర్చోబెట్టారని విమర్శించారు..
నిజాం నకలునే కేసీఆర్ (KCR) చూపించారని రేవంత్ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని ఆయన ఏనాడు ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదని పేర్కొన్నారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. ఆయన నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైందని తెలిపారు. గత చరిత్రను పరిశీలిస్తే.. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చెబుతోందన్నారు.. రాచరిక పోకడలతో రాజకీయ వారసత్వాన్ని చలాయించాలనుకొన్న కేసీఆర్ ప్రయత్నం ఆయన పతనానికి కారణమని వివరించారు. ..
ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం చూపారని, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని అణిచివేసే ప్రయత్నం చేశారని తెలిపిన సీఎం.. 75 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు మళ్లీ పోరాడి స్వేచ్ఛను తెచ్చుకున్నారన్నారు.. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తు.. సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపించారు. ఇన్నాళ్లు కవులు కళాకారులను తన గడీలో బంధించారని.. దొరగారి భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారని మండిపడ్డారు..
అందుకే మా ప్రభుత్వం ఉద్యమ సూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని రేవంత్ తెలిపారు.. అదీగాక రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామని.. మేం పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు..
అదేవిధంగా కొద్దిమంది అధికారులతో గత ప్రభుత్వం సాగించిన పాలనకు స్వస్తి చెప్పాం. పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నట్లు రేవంత్ తెలిపారు.. హరీష్ ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదని చురకలు అంటించారు..
తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను కేసీఆర్ నాటి వెళ్లారని.. ప్రస్తుతం అవి దుర్గంధం వెదజల్లుతున్నాయని విమర్శించారు. రోజుకు 18గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తామని రేవంత్ హెచ్చరించారు.. రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉందని. తెలంగాణ ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు..కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని మండిపడ్డారు..