Telugu News » Gade innaiah : కాంగ్రెస్ లో ఉన్న ఏక్ నాథ్ షిండే ఎవరంటే.. గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు..!

Gade innaiah : కాంగ్రెస్ లో ఉన్న ఏక్ నాథ్ షిండే ఎవరంటే.. గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు..!

ఈ ఒప్పందం మోడీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ పెద్దలకు మాత్రమే తెలుసని గాదె ఇన్నయ్య పేర్కొన్నారు.. ఇక ఆయన వచ్చిన పని అయిపోయిందని, తర్వాత బీజేపీలో చేరడం మాత్రమే మిగిలి ఉందని, లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగేది ఇదే అని జోస్యం చెప్పారు..

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ (BRS), బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇదే సమయంలో ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ఉన్నారని త్వరలో బయటకు వస్తారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి ఏక్ నాథ్ షిండే అంశం తెర మీదకి రావడం ఆసక్తికరంగా మారింది..

బీజేపీతో ఒప్పందంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ (Congress)లో చేరారని, త్వరలో బీజేపీలో జాయిన్ అవుతారని గాదె ఇన్నయ్య షాకిచ్చారు.. తాజాగా ఓ మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరక ముందు 8 నెలల పాటు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారాన్ని కూల్చడం బీజేపీతో సాధ్యం కాదని భావించినట్లు వెల్లడించారు..

అందుకే కాంగ్రెస్ ద్వారా ఆ పని ముగించుకొని బీజేపీ (BJP)లో జాయిన్ అవుతానని పార్టీ పెద్దలతో ముందే ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. ఈ ఒప్పందం మోడీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ పెద్దలకు మాత్రమే తెలుసని గాదె ఇన్నయ్య పేర్కొన్నారు.. ఇక ఆయన వచ్చిన పని అయిపోయిందని, తర్వాత బీజేపీలో చేరడం మాత్రమే మిగిలి ఉందని, లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగేది ఇదే అని జోస్యం చెప్పారు..

ఇదిలా ఉండగా.. మొన్నటివరకు అధికార ప్రతిపక్షాలు ఒకరిని మరొకరు ఏక్ నాథ్ షిండే అవుతారని తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో ఇన్నయ్య ఈ తరహ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో ఏం జరగబోతోందనే ఆసక్తి పుట్టించినట్లు అయ్యిందని అంటున్నారు. నిప్పులో ఉప్పు వేసినట్లుగా గత కొద్ది రోజుల క్రితం బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ నుంచి ఏక్ నాథ్ షిండే బయటకి వస్తారని, ఆయన ఎవరో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment