Telugu News » Hyderabad : ఎంఐఎం-బీఆర్ఎస్ కు నమ్మక ద్రోహం చేసిందా !.. కవిత అరెస్ట్‌పై సైలెంట్‌ ఎందుకు..?

Hyderabad : ఎంఐఎం-బీఆర్ఎస్ కు నమ్మక ద్రోహం చేసిందా !.. కవిత అరెస్ట్‌పై సైలెంట్‌ ఎందుకు..?

మరోవైపు రాష్ట్ర విభజనకు ముందు వరకూ కాంగ్రెస్ (Congress) ఎంఐఎం కలసి ఉండేవి. కానీ గులాబీ అధికారంలోకి వచ్చాక హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ ను పరోక్షంగా కంట్రోల్ చేసింది అనే ఆరోపణలు మూటగట్టుకొంది.

by Venu
CBI has stepped in..Kavitha's emergency petition in the special court!

రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంఐఎం (AIMIM)తో బంధాన్ని కొనసాగించింది. ఈ రెండు పార్టీలు నమ్మకమైన మిత్రులుగా పదేళ్ళ పాటు ప్రయాణం సాగించారన్న విషయం తెలిసిందే.. ప్రతిపక్షాలు వీరిపై ఎన్ని విమర్శలు చేసినా.. ఒకరి ఇలాకాలో ఒకరు జోక్యం చేసుకోరు. అలాగని ఎన్నికల్లో నేరుగా పొత్తులుండవు. కానీ అన్ని విషయాల్లో మిత్రపక్షంగా వ్యవహరించడం కనిపించింది.

brs mim new planఅలాగని అధికారికంగా మాత్రం మిత్రపక్షం కాదు. బీఆర్ఎస్ పాతబస్తీలో పోటీ చేస్తుంది. అలాగే హైదరాబాద్ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. కానీ ఒకరికి ఒకరు శత్రువులుగా ఎప్పుడు ప్రవర్తించలేదు. మరోవైపు రాష్ట్ర విభజనకు ముందు వరకూ కాంగ్రెస్ (Congress) ఎంఐఎం కలసి ఉండేవి. కానీ గులాబీ అధికారంలోకి వచ్చాక హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ ను పరోక్షంగా కంట్రోల్ చేసింది అనే ఆరోపణలు మూటగట్టుకొంది.

కానీ ఎక్కడ తగ్గకుండా ఈ రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య కెమెస్ట్రీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయే వరకు బలంగా సాగింది. ఒకగానొక సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి వెనక అసద్ ఆలోచన ఉండనే ప్రచారం కూడా జరిగింది. ఇంతలా అల్లుకుపోయిన బీఆర్ఎస్, ఎంఐఎం బంధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క సారిగా మారింది. ఎంతలా అంటే కేసీఆర్ (KCR) కూతురు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే కనీసం స్పందించ లేనంతగా..

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కవిత అరెస్ట్ అంశం ఆసక్తికరంగా మారగా.. ఎంఐఎం మాత్రం తనకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరించడం టాక్ ఆఫ్ ది మ్యాటర్ గా ముందుకు వచ్చింది. అయితే గతంలో ముస్లిం ఓటర్లు ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఓటేయాలని రెండు పర్యాయాలు అసదుద్దీన్ ఓపెన్‌గా ప్రజలకు రిక్వెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్న వారు.. ఈ అంశంపై చర్చలు లేవనెత్తారు..

మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం.. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం వంటి పరిణామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బీజేపీ అంటే ఒంటి కాలిపై లేచే అసదుద్దీన్ ఒవైసీ కానీ, మరో ఎంఐఎం ముఖ్య నేత అక్బరుద్దీన్ కానీ కవిత అరెస్ట్‌పై పెదవి విప్పక పోవడం ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నారు.

ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో వైరం ఎందుకనే భావనలో ఉన్న ఎంఐఎం నేతలు.. అవినీతి ఆరోపణలతో ఉంటదో పోతదో తెలియని పార్టీ కోసం నోరు జారడం ఎందుకని అనుకొంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఎంఐఎం చీఫ్ అసద్, మరో కీలక నేత అక్బరుద్దీన్ సహా ఇతర నేతలంతా సైలెంట్ అయిపోయారనే టాక్ నడుస్తోంది. అదీగాక ప్రతిపక్ష పార్టీల కేసులపై బీజేపీ (BJP) ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో కవిత ఇష్యూపై సైలెంట్‌గా ఉండటమే బెటర్ అని అనుకొంటునట్లు టాక్..

You may also like

Leave a Comment