నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ మల్లు రవి (Mallu Ravi), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మండిపడ్డారు.. ఉన్నతమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. బీఆర్ఎస్ లో చేరి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.. దళితుల ఓట్ల కోసం కేసీఆర్ వేసిన వలలో ఆర్ఎస్ ప్రవీణ్ చిక్కుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.. బీఆర్ఎస్ తో జత కట్టి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన చివరికి నాగర్ కర్నూల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని మెజార్టీ సీట్లలో గెలిపించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆరోపించారు.. ఇందు కోసం గెలవరు అని తెలిసిన.. డమ్మీ అభ్యర్థులను పోటీలో నిలబెడుతోందని ఆరోపించారు. ఇదంతా ప్రధాని మోడీ కోసం.. కవితను కేసు నుంచి తప్పించడం కోసం కేసీఆర్ వేసిన ఎత్తుగా విమర్శించారు..
ఇదిలా ఉండగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. మనసు మార్చుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బీఎస్పీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరినట్లు చర్చించు కొంటున్నారు.. అయితే ఈ సారి ఎంపీగా నాగర్ కర్నూల్ టికెట్ ఇచ్చారు గులాబీ బాస్..
మరోవైపు కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్పీ, బీజేపీ నుంచి నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, ఆర్ఎస్పీ (RS Praveen Kumar) పోటీ పడుతుండటంతో నాగర్ కర్నూల్ ఎన్నిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అయ్యింది. ఈ పోరు ఉత్కంఠంగా సాగే అవకాశాలు ఉన్నట్లు అప్పుడే చర్చలు మొదలైయ్యాయి..